రాహుల్ గాంధీ కండలను చూసి అచ్చెరువొందిన బాక్సర్ విజేందర్ సింగ్!

28-02-2021 Sun 08:37
  • ఇటీవల కేరళలో పర్యటించిన రాహుల్
  • తడిసిన బట్టలతో పడవపై నిలబడిన చిత్రం వైరల్
  • ఇవి ఓ బాక్సర్ కు ఉండే కండలన్న విజేందర్
Boxer Vijender Singh Comment on Rahul Gandhi Abs

ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్న కేరళలో పర్యటించిన రాహుల్ గాంధీ, మత్స్యకారుల సమస్యలను తెలుసుకునేందుకు వారితో కలసి సముద్రంలోకి వెళ్లడంతో పాటు, కాసేపు ఈత కొట్టిన సంగతి తెలిసిందే. రాహుల్ స్టామినా చూసి ఆశ్చర్యపోయిన బాక్సర్ విజేందర్ సింగ్, తడిసిన బట్టలతో పడవపై నిలబడివున్న రాహుల్ గాంధీ చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

"ఇవి ఓ బాక్సర్ కు ఉండేటువంటి కండలు. మోస్ట్ డేరింగ్ యంగ్ ఫిట్... ప్రజల నేత రాహుల్ గాంధీ" అని వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 50 సంవత్సరాల కాంగ్రెస్ నేత, దాదాపు 10 నిమిషాల పాటు సముద్రంలో ఈత కొడుతూ గడపగా, గత వారం ఆ చిత్రాలు వైరల్ అయిన సంగతి విదితమే.