నేటి నుంచి పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో వాహనాల దారి మళ్లింపు

28-02-2021 Sun 08:26
  • తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు
  • వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తుల రాక
  • ఐదు రోజులపాటు జరగనున్న జాతర
  • కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ మీదుగా వాహనాల మళ్లింపు
Traffic diversions in Suryapet over Peddagattu jatara

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట సమీపంలోని పెద్దగట్టు (గొల్లగట్టు) దురాజ్‌పల్లిలో జరిగే ఈ జాతరను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి వేలాదిమంది భక్తులు జాతరకు తరలివస్తారు.

జాతర రద్దీ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేవారు కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌ప్లలి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్లేవారు నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.