రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్ రన్.. ఆర్ఎఫ్‌సీఎల్‌కు పునర్‌వైభవం!

28-02-2021 Sun 08:13
  • రెండు దశాబ్దాల క్రితం మూతపడిన ఆర్ఎఫ్‌సీఎల్
  • రూ. 6,180 కో్ట్లతో పునురుద్ధరణ పనులు
  • వేపనూనె పూత పూసిన యూరియా తయారీ
Trial Run heal at RFCL in Telangana

దాదాపు రెండు దశాబ్దాల క్రితం మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్)కు మళ్లీ పునర్వైభవం రానుంది. రూ. 6,180 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ ఫ్యాక్టరీలో వేపనూనె పూత పూసిన యూరియాను ఉత్పత్తి చేయనున్నారు. ఇక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేయనున్నారు.

కాగా, గత అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో సంస్థ సీఈవో నిర్లప్ సింగ్ రాయ్ సమక్షంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం రాయ్ మాట్లాడుతూ ప్లాంట్ పనితీరును పరీక్షించేందుకే ట్రయల్ రన్ నిర్వహించినట్టు చెప్పారు. మార్చి నుంచి ఇక్కడ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు.