మారిన తెలంగాణ ఎడ్ సెట్ ప్రశ్నాపత్రం విధానం!

28-02-2021 Sun 07:37
  • కంప్యూటర్ విద్యను జోడించిన టెస్ట్ కమిటీ
  • 150 మార్కుల్లో 20 మార్కులు కంప్యూటర్ అవగాహనకు
  • ఆగస్టులో జరగనున్న పరీక్ష
Changes in Telangana Edset Question Paper

తెలంగాణ రాష్ట్రంలో ఎడ్ సెట్ ప్రశ్నాపత్రం తయారీ విధానాన్ని మార్చారు. తాజాగా జరిగే పరీక్షలకు కంప్యూటర్ విద్యను కూడా జోడించారు. ఈ మేరకు టెస్ట్ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించామని ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య పాపిరెడ్డి వెల్లడించారు.

మొత్తం 150 మార్కుల ప్రశ్నాపత్రంలో కంప్యూటర్ పై అవగాహనకు 20 మార్కులు ఉంటాయని తెలిపారు. కాగా, మార్చి 28న ఎడ్ సెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నామని, మే 5 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఉంటుందని, ఆగస్టులో పరీక్ష నిర్వహిస్తామని పాపిరెడ్డి వెల్లడించారు.