వచ్చే వారం నుంచి 'ఆదిపురుష్' షూటింగులో ప్రభాస్

27-02-2021 Sat 21:59
  • సెట్స్ పై ప్రభాస్ రెండు సినిమాలు 
  • ఇటీవలే 'సలార్' షెడ్యూలు పూర్తి  
  • 'ఆదిపురుష్' కోసం ముంబైలో సెట్స్ 
  • ముందుగా యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
Prabhas to join Adipurush shoot next week

తాజాగా ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' సినిమా పూర్తికాగా, మరో రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ పై వున్నాయి. వీటిలో ఒకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' కాగా.. మరొకటి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న 'ఆదిపురుష్'. ఇటీవలే 'ఆదిపురుష్' చిత్రం షూటింగు కార్యక్రమాలను ముంబైలో మొదలెట్టారు.

ఈ క్రమంలో ఈ చిత్రం షూటింగులో ప్రభాస్ వచ్చే వారం జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది. ముంబైలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్ లో ఈ షూటింగ్ నిర్వహిస్తారని సమాచారం. ముందుగా ప్రభాస్ పాల్గొనే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారట. రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో సుమారు 500 కోట్ల బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో విలన్ గా లంకేశ్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. రాముడి తల్లిపాత్రకు ప్రముఖ నటి హేమమాలినిని తీసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక కథానాయికగా సీత పాత్రలో కృతి సనన్ ఇప్పటికే ఎంపికైందని అంటున్నారు. ఇదిలావుంచితే, ఇటీవలే 'సలార్' సినిమా కోసం ప్రభాస్ పది రోజుల షెడ్యూలును పూర్తిచేసిన సంగతి విదితమే!