వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం... విశాఖలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న విజయసాయి

27-02-2021 Sat 21:15
  • జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయసాయి తదితరులు
  • విశాఖ నార్త్ నియోజకవర్గంలో ప్రచారం
  • వైసీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు
  • సీఎం జగన్ ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పరిపాలిస్తున్నారని వెల్లడి
Vijayasai Reddy campaigns in Vizag for GVMC elections

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ముమ్మరంగా పాల్గొంటున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఇవాళ పర్యటించిన ఆయన హామీలు ఇస్తూ ముందుకు సాగారు. విశాఖలో అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని విజయసాయి ఉద్ఘాటించారు.

 ప్రజాసంక్షేమమే పరమావధిగా సీఎం జగన్ పరిపాలన కొనసాగుతోందని, వైసీపీ అభ్యర్థులను అత్యధిక ఆధిక్యంతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ధోబీ ఘాట్ నిర్మాణంతో పాటు శివనగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. కాగా, విశాఖ నార్త్ నియోజకవర్గంలో జరిగిన నేటి ప్రచారంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.