మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం జనసేన సమన్వయ కమిటీలు

27-02-2021 Sat 20:30
  • విశాఖ, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లకు సమన్వయ కమిటీల నియామకం
  • అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్న కమిటీలు
  • పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయనున్న కమిటీలు
Janasena announces coordination committees for municipal corporation elections

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు సమన్వయ కమిటీలను జనసేన నియమించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లకు సమన్వయ కమిటీలను జనసేనాని పవన్ కల్యాణ్ నియమించారు. ఎన్నికలకు అవసరమైన అన్ని పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీలు సమన్వయం చేస్తాయి. అభ్యర్థులకు అనుక్షణం అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలను అందిస్తాయి. అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తాయి.

సమన్వయ కమిటీల వివరాలు:

విజయవాడ: చిల్లపల్లి శ్రీనివాస్, అక్కల గాంధీ, బూరగడ్డ శ్రీకాంత్, అమ్మిశెట్టి వాసు, రమాదేవి.
విశాఖపట్నం: ఏవీ రత్నం, పాలవలస యశస్విని, బొడ్డుపల్లి రఘు, పరుచూరి భాస్కరరావు.
గుంటూరు: మనుక్రాంత్ రెడ్డి, కల్యాణం శ్రీనివాస్, పాకనాటి రమాదేవి.