Uttam Kumar Reddy: వామనరావు దంపతుల హత్య వంగవీటి రంగా హత్యను తలపించింది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy visits Gujapadugu and consoled Vaman Rao family members
  • ఇటీవల న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్య
  • గుంజపడుగు వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • వామనరావు కుటుంబసభ్యులకు పరామర్శ
  • దారుణంగా చంపారని వ్యాఖ్యలు
  • స్థానిక పోలీసులు ఎందుకు రక్షణ కల్పించలేదన్న ఉత్తమ్
ఇటీవల పెద్దపల్లి జిల్లా గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు, నాగమణి దంపతులను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుంజపడుగు గ్రామంలో పర్యటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు వామనరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,  పట్టపగలే నడిరోడ్డుపై న్యాయవాదులను హత్య చేయడం దారుణమని పేర్కొన్నారు. వామనరావు దంపతుల హత్య వంగవీటి రంగా హత్యను తలపించిందని అన్నారు. జంటహత్యల ఘటనతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. వామనరావు దంపతులకు పోలీసుల నుంచే బెదిరింపులు వచ్చాయని వెల్లడించిన ఉత్తమ్ కుమార్... వామనరావుకు స్థానిక పోలీసులు ఎందుకు రక్షణ కల్పించలేదని ప్రశ్నించారు.
Uttam Kumar Reddy
Vaman Rao
Nagamani
Murder
Gunjapadugu
Vangaveeti Ranga
Congress
Telangana

More Telugu News