Pawan Kalyan: 'పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ' అంటూ మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

Grandhi Srinivas calls Pawan Kalyan as State Rowdi
  • పవన్ కల్యాణ్ ఓ మానసిక రోగి
  • అజ్ఞానంతో ఆయన మాట్లాడుతున్నారు
  • అవగాహనా లోపంతో ఆయన పార్టీ పెట్టారు 
భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఓ ఆకు రౌడీ అని... బ్యాంకులను మోసం చేసిన చరిత్ర ఆయనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను పిచ్చికుక్కల వ్యాన్ లో వేసి తీసుకెళ్లాలని అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై గ్రంధి శ్రీనివాస్ అదే స్థాయిలో మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ అని శ్రీనివాస్ అన్నారు. అవగాహనా లోపంతో పవన్ రాజకీయ పార్టీ పెట్టారని... ఇప్పుడు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్ ఓ మానసిక రోగి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పిచ్చి కుక్కల వ్యాన్ లో వేసి పంపుతామని పవన్ అన్నారని... గత ఎన్నికల్లో రెండు చోట్ల అదే వ్యాన్ లో ప్రజలు పంపించారనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు.
Pawan Kalyan
Janasena
Grandhi Srinivas
YSRCP

More Telugu News