TTD: రూ.2,937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం

TTD annual budget gets nod from board members
  • ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం
  • చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం
  • మీడియాకు వివరాలు తెలిపిన వైవీ
  • ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
  • టీటీడీ వేద పాఠశాల పేరు మార్పు
  • చిన్నపిల్లల ఆసుపత్రికి రూ.9 కోట్లు
ఇవాళ నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం వివరాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. రూ.2,937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం లభించినట్టు తెలిపారు. ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని చెప్పారు. శ్రీవారి మెట్టుమార్గంలో అన్నదానం చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం నిర్వహిస్తామని వివరించారు. దేశంలోని అన్ని టీటీడీ కల్యాణ మండపాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. టీటీడీ వేద పాఠశాలను ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేరు మార్చాలని తీర్మానం చేశామని వెల్లడించారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రి పాత భవనంలో చిన్నపిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు రూ.9 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
TTD
Annual Budget
YV Subba Reddy
Tirumala
Andhra Pradesh

More Telugu News