Harish Rao: బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి?: హరీశ్ రావు

Why should vote for BJP asks Harish Rao
  • పీవీకి కాంగ్రెస్ కనీస గౌరవం కూడా ఇవ్వలేదు
  • ఆయనకు సమాధి కూడా కట్టించలేదు
  • పెట్రోల్ ధరలను పెంచుతున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా?
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. పార్టీ నేతల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీశ్ రావు మండిపడ్డారు. దివంగత పీవీ నరసింహారావుకి కాంగ్రెస్ పార్టీ కనీస గౌరవం కూడా ఇవ్వలేదని... ఆయనకు సమాధిని కూడా కట్టలేదని విమర్శించారు. పీవీ కుమార్తెను తాము ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించగానే ఆ రెండు పార్టీల్లో కలవరం మొదలైందని అన్నారు. తమకు ఓటు వేయాలని కాంగ్రెస్, బీజేపీలు అడుగుతున్నాయని... వారికి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.

ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని హరీశ్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు గిరిజన యూనివర్శిటీ ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు వేయాలా? అని ప్రశ్నించారు. 7 తెలంగాణ గ్రామాలను ఆంధ్రలో కలిపినందుకు వేయాలా? అని అడిగారు. తెలంగాణ ప్రజల పార్టీ టీఆర్ఎస్ అని... రెండు ఎమ్మెల్సీ స్థానాలను తామే గెలుచుకుంటామని చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేస్తామని తెలిపారు.
Harish Rao
TRS
BJP
Congress

More Telugu News