Talasani: ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్దకు చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా?: తలసాని

Talasani counters Dasoju Sravan comments on KTR
  • ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వంపై ధ్వజమెత్తిన దాసోజు
  • గన్ పార్క్ వద్ద బైఠాయింపు
  • చర్చకు రావాలంటూ కేటీఆర్ కు సవాల్
  • చర్చకు పిలిచేందుకు తగిన స్థాయి ఉండాలన్న తలసాని
హైదరాబాదులో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్  మంత్రి కేటీఆర్ కు సవాల్ విసరడంపై తలసాని ఘాటుగా స్పందించారు.

ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్ద చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా? అని వ్యాఖ్యానించారు. చర్చకు రమ్మని అడగడానికి ఓ స్థాయి ఉండాలని అన్నారు. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసేవాళ్లు తమ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. గత ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనలో విఫలమైతే, టీఆర్ఎస్ ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసిందని తలసాని అన్నారు. కాగా, దాసోజు శ్రవణ్ ఉద్యోగాల భర్తీ అంశంలో గన్ పార్క్ వద్ద బైఠాయించడం తెలిసిందే.
Talasani
Dasoju Sravan
KTR
Challenge
Gun Park
TRS
Congress
Hyderabad
Telangana

More Telugu News