Rajamouli: రాజ‌మౌళి చేతుల మీదుగా 'గాలి సంప‌త్' సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌

 GaaliSampathTrailer launched by Ace Director ssrajamouli
  • అనీష్ కృష్ణ దర్శకత్వంలో సినిమా
  • మ‌హా శివ‌రాత్రి సందర్భంగా మార్చి 11న విడుద‌ల
  • అల‌రిస్తోన్న డైలాగులు
డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో అనీష్ కృష్ణ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న 'గాలి సంప‌త్' సినిమా ట్రైల‌ర్ ఈ రోజు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చేతుల మీదుగా విడుద‌లైంది. ఎస్.క్రిష్ణ , షైన్ స్క్రీన్స్ సంస్థ‌ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ‌ హీరో శ్రీ విష్ణు, ల‌వ్లీ సింగ్, రాజేంద్ర ‌ప్రసాద్ ప్ర‌ధాన‌పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న విడుద‌ల కానుంది.

'ప్ర‌తి అమ్మాయికీ డ‌బ్బున్నోడు కావాలి.. లేక‌పోతే ఫారిన్ వాడు కావాలి.. డ‌బ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డ‌బ్బే ఇస్తాడు. టైమ్ ఎక్క‌డి నుంచి ఇస్తాడు' అంటూ హీరోయిన్ కి హీరో చెబుతోన్న డైలాగు అల‌రిస్తోంది. హీరోకి తండ్రిగా రాజేంద్ర ప్ర‌సాద్ న‌ట‌న ఆక‌ర్షిస్తోంది.

 
Rajamouli
Tollywood

More Telugu News