Rashmika Mandanna: విజయ్ దేవరకొండ సరసన మరోసారి రష్మిక?

Rashmika to work with Vijay third time
  • విజయ్ తో రెండు సినిమాలు చేసిన రష్మిక
  • సుకుమార్ దర్శకత్వంలో విజయ్ సినిమా
  • విజయ్ సరసన రష్మిక మూడోసారి  
ప్రెట్టీ డాల్ రష్మిక ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ స్టార్.. స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ మంచి డిమాండులో వుంది. మరోపక్క హిందీలో కూడా నటిస్తూ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అలాంటి భామ ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండతో మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో విజయ్ తో ఈ చిన్నది 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా అల్లు అర్జున్, రష్మిక జంటతో 'పుష్ప' చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ హీరోగా చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చింది. ఇక ఈ చిత్రంలో విజయ్ కు జంటగా రష్మికను తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నాడట.

ప్రస్తుతం 'పుష్ప' షూటింగులో ఆమె అంకితభావాన్ని స్వయంగా చూస్తున్న సుకుమార్ తన తదుపరి చిత్రంలో కూడా ఆమెనే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే కనుక విజయ్ దేవరకొండతో ఈ ముద్దుగుమ్మకు హ్యాట్రిక్ సినిమా అవుతుందన్న మాట!
Rashmika Mandanna
Vijay Devarakonda
Sukumar
Pushpa

More Telugu News