ఇతని తెలివికి ఆ అర్హత లేదు: ఆనంద్ మహీంద్రా

27-02-2021 Sat 06:23
  • సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా
  • రైల్లో కంటికి మాస్క్ వేసుకుని కునుకు తీస్తున్న యువకుడు
  • ముంబైలో కేసుల పెరుగుదలకు ఇవే కారణాలన్న ఆనంద్
Anand Mahindra Tweet Goes Viral

సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ, తన దృష్టికి వచ్చిన, తనకు నచ్చిన వివిధ అంశాలను ఫాలోవర్లతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆయన ఓ ఫొటోను షేర్ చేసి, "ఇటీవలి కాలంలో ముంబైలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దానికి కారణాలు వెతికితే... ఇదే సమయంలో ఇతని తెలివితేటలకు ఎటువంటి పొగడ్తలూ పొందే అర్హత లేదు" అంటూ కామెంట్ పెట్టారు.

ఈ చిత్రం ఓ రైలులో తీసినది. మాస్క్ వేసుకోకుండా బయటకు రావద్దంటున్న ఆరోగ్య శాఖ అధికారుల సూచనలను అతను పాటించాడు కానీ, మాస్క్ ను ముక్కు, మూతికి ధరించలేదు. దర్జాగా సీటులో కూర్చుని, మాస్క్ తో కళ్లు కప్పుకుని కునుకు తీస్తున్నాడు.