ఆ కమిటీలో నేను లేను.. నారా లోకేశ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి

26-02-2021 Fri 21:44
  • స్టీల్ ప్లాంట్ కమిటీలో అవినాశ్ రెడ్డి ఉన్నాడన్న లోకేశ్
  • ప్రైవేటీకరణపై ఆ కమిటీ నిర్ణయం తీసుకుందని వెల్లడి
  • లోకేశ్ ఆరోపణలను ఖండించిన అవినాశ్ రెడ్డి
  • తాను ఏ కమిటీలో సభ్యుడిగా లేనని స్పష్టీకరణ
Avinash Reddy condemns Nara Lokesh allegations

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకున్న కమిటీలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ఉన్నాడని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యాఖ్యానించగా, ఆ వ్యాఖ్యలను ఎంపీ అవినాశ్ రెడ్డి ఖండించారు. తాను స్టీల్ ప్లాంట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నానంటూ లోకేశ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వివరించారు.తాను ఏ కమిటీలో సభ్యుడిగా లేనని స్పష్టం చేశారు. లోకేశ్ తనపై చేసిన ఆరోపణలు హాస్యాస్పదం అని కొట్టిపారేశారు.

మంత్రి పెద్దిరెడ్డిపైనా, ప్రభుత్వ సలహాదారు సజ్జలపైనా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అవినాశ్ రెడ్డి హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని వెల్లడించారు.