Kishan Reddy: చెన్నైలో తెలుగు వారు నివసిస్తున్న ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన

Kishan Reddy visits Telugu people in Chennai ahead of state assembly elections
  • త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
  • తమిళనాడులో బీజేపీ ఇన్చార్జిగా కిషన్ రెడ్డి
  • ఎన్డీయే కూటమిదే విజయం అని వ్యాఖ్యలు
  • మళ్లీ అమ్మపాలన రావాలని ఆకాంక్ష
  • అందుకు తెలుగువారు కృషి చేయాలని పిలుపు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ అధినాయకత్వం తమిళనాడులో పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిషన్ రెడ్డి నేడు చెన్నైలో తెలుగువారు నివసించే ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. తెలుగువారి సమస్యలను సీఎం పళనిస్వామి దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. తమిళనాడులో మళ్లీ అమ్మపాలన కోసం తెలుగువారు కృషి చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. డీఎంకే కుటుంబ పాలన రాకుండా పోరాడాలని కోరారు. 
Kishan Reddy
Chennai
Telugu People
Assembly Elections
Tamilnadu

More Telugu News