జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి తీసుకురండి సార్... చంద్రబాబును కోరిన తెలుగు తమ్ముళ్లు!

26-02-2021 Fri 21:17
  • కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
  • శాంతిపురంలో రోడ్ షో
  • జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేసిన అభిమానులు
  • జూనియర్ రావాలంటూ కోరిన వైనం
  • ఆలోచిద్దాం అన్నట్టుగా చంద్రబాబు రియాక్షన్
TDP cadre wants Jr NTR in election campaign

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు కూడా ఉన్నాయంటూ వైసీపీ నేతలు పేర్కొంటుండడం తెలిసిందే. కాగా, నియోజకవర్గంలోని శాంతిపురంలో చంద్రబాబు రోడ్ షో కొనసాగుతుండగా, కొందరు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు.

 చంద్రబాబును గట్టిగా కేకలు వేసి మరీ పిలిచిన ఆ తెలుగు తమ్ముళ్లు... జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి దింపండి సార్... జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రావాలి సార్ అంటూ విజ్ఞప్తి చేశారు. వారి కోరిక విన్న చంద్రబాబు ఆలోచిద్దాం అన్నట్టుగా తల ఊపారు. ఆపై తనదైన శైలిలో అభివాదం చేశారు.