Nagarjuna Sagar Bypolls: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ!

  • టీడీపీ బరిలోకి దిగుతోందని ప్రకటించిన మువ్వ అరుణ్ కుమార్
  • తనను పోటీ చేయమని పార్టీ ఆదేశించిందని వ్యాఖ్య
  • ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటన
TDP contesting in Nagarjuna Sagar Bypolls

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. ఎవరికి వారే వ్యూహాలతో ఎన్నికకు సమాయత్తమయ్యారు. కాంగ్రెస్ తరపున మాజీ హోంమంత్రి జానారెడ్డి బరిలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.

మరోవైపు ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ తెరపైకి వచ్చింది. సాగర్ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగుతోంది. ఈ విషయాన్ని నాగార్జునసాగర్ టీడీపీ ఇన్చార్జి మువ్వ అరుణ్ కుమార్ వెల్లడించారు. టీడీపీ తరపున తనను బరిలోకి దిగాలని పార్టీ నాయకత్వం ఆదేశించిందని చెప్పారు. సాగర్ అభివృద్ధి చెందడానికి టీడీపీనే కారణమని అన్నారు. ఉపఎన్నికలో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో సాగర్ కు ఉపఎన్నిక జరుగుతోంది.  

More Telugu News