పాకిస్థాన్ తో సంబంధాలు పెట్టుకోకపోవడమే మంచిది: గౌతమ్ గంభీర్

26-02-2021 Fri 20:43
  • క్రికెట్ అనేది చాలా చిన్న విషయం
  • సైనికుల ప్రాణాలే ముఖ్యం
  • సీమాంతర ఉగ్రవాదం ఆగేంతవరకు పాక్ తో సంబంధాలు వద్దు
Better not to keep contacts with Pakistan says Gautam Gambhir

దేశం విషయానికి వస్తే క్రికెట్ అనేది చాలా చిన్న విషయమని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు. క్రికెట్ కంటే సైనికుల ప్రాణాలే ముఖ్యమని చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతివ్వడం ఆపేంత వరకు ఆ దేశంతో మనం సంబంధాలు పెట్టుకోకపోవడమే మంచిదని అన్నారు. క్రీడల పరంగా పాకిస్థాన్ తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం ఆగేంతవరకు పాక్ తో సంబంధాలు వద్దని అన్నారు. గ్లోబర్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్, ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సెమినార్ లో గంభీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.