రఘురామకృష్ణరాజుపై కేసులు పెడుతున్నందుకు కారణం ఇదే: రంగనాథరాజు

26-02-2021 Fri 20:27
  • పలువురి మనోభావాలు దెబ్బతీసేలా ఆయన మాట్లాడుతున్నారు
  • ముఖ్యమంత్రి కార్యాలయంపై విమర్శలు చేశారు
  • గౌరవ పదవుల్లో వున్న మాపై చులకనగా మాట్లాడారన్న మంత్రి 
This is why cases are filing against Raghu Rama Krishna Raju says Ranganatha Raju

పలువురి మనోభావాలను దెబ్బతీసే విధంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారని... అందుకే ఆయనపై పలువురు కేసులు పెడుతున్నారని ఏపీ మంత్రి రంగనాథరాజు అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంపై రఘురాజు విమర్శలు చేశారని... ఇది సరికాదని చెప్పారు. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిగా ఆయన నిలిచిపోతారని అన్నారు.

మంత్రిగా ఉన్న తనను, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని హేళన చేసే విధంగా ఆయన మాట్లాడారని... ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న తమ గురించి చులకనగా మాట్లాడటం సరికాదని అన్నారు. కులాలు, మతాలు, పార్టీలు, వ్యక్తులు, అధికారులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారని మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.