హారర్ సినిమాలో విజయ్ సేతుపతి గెస్ట్ పాత్ర

26-02-2021 Fri 18:21
  • విలక్షణ పాత్రలు పోషించే విజయ్ సేతుపతి
  • 'ఉప్పెన' సినిమా విజయంలో కీలక పాత్ర
  • తమిళ సినిమా 'పిశాసు' సీక్వెల్ లో గెస్ట్  
Vijay Setupati guest role in Pisasu sequel

విజయ్ సేతుపతి విలక్షణమైన నటుడు.. పలు సినిమాలలో హీరోగా నటించినా కథానాయకుడుగానే నటిస్తానని మడికట్టుకుని కూర్చోకుండా, మంచి పాత్ర అనిపిస్తే చాలు, చిన్నదైనా చేయడానికి రెడీగా వుండే నటుడు అతను. అందులోనూ విజయ్ కి భాషా భేదాలు కూడా లేవు. అందుకే, తమిళ సినిమాలే చేస్తానని గిరిగీసుకుని కూర్చోలేదు. తమిళ, తెలుగు, హిందీ... మనసుకు నచ్చిన పాత్ర ఎక్కడ లభిస్తే అక్కడ చేయడానికి ముందుంటాడు. ఇటీవల 'ఉప్పెన' సినిమాలో ఆయన పోషించిన పాత్ర సినిమా విజయానికి ఎంతో హెల్ప్ అయింది.

ఈ క్రమంలో తాజాగా తమిళంలోనే ఓ గెస్ట్ పాత్ర పోషించడానికి విజయ్ ఓకే చెప్పాడు. గతంలో మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన 'పిశాసు' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ హారర్ సినిమాలో గెస్ట్ పాత్ర అడగగానే, అది నచ్చడంతో చేయడానికి వెంటనే ఒప్పేసుకున్నాడట. త్వరలో ఈ చిత్రం షూటింగులో విజయ్ సేతుపతి జాయిన్ అవుతాడని సమాచారం.