Toll Fees: భారీగా పెరిగిన అలిపిరి టోల్ గేట్ చార్జీలు

  • అలిపిరి టోల్ గేట్ చార్జీలపై టీటీడీ తీర్మానం
  • గతేడాది జరిగిన సమావేశంలో నిర్ణయం
  • టీటీడీ నిర్ణయంపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు
  • కారు టోల్ గేట్ చార్జీ రూ.15 నుంచి రూ.50కి పెంపు
Alipiri tollgate charges hikes as govt issued orders

తిరుపతిలోని అలిపిరి టోల్ గేట్ చార్జీలను భారీగా పెంచారు. 2020 మార్చిలో జరిగిన టీటీడీ సమావేశంలో టోల్ గేట్ చార్జీలు పెంచుతూ తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో, టీటీడీ పాలకమండలి తీర్మానం మేరకు అలిపిరి టోల్ గేట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కారు టోల్ గేట్ చార్జీ రూ.15 నుంచి రూ.50కి పెంచారు. మినీ బస్సు, మినీ లారీకి రూ.50 నుంచి రూ.100కి పెంచారు. లారీలు, బస్సుల టోల్ గేట్ చార్జీలను రూ.100 నుంచి రూ.200కి పెంచారు.

More Telugu News