త్వరలో కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయం వెల్లడిస్తా: బండి సంజయ్

26-02-2021 Fri 14:02
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
  • ఎంపీగా కేసీఆర్ పార్లమెంటును తప్పుదోవ పట్టించాడని ఆరోపణ
  • స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నానని వెల్లడి
  • బీజేపీ అధిష్ఠానం అనుమతితో బట్టబయలు చేస్తానని వ్యాఖ్యలు
Bandi Sanjay says soon he will reveal a sensational matter about KCR

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ త్వరలో సీఎం కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయాన్ని వెల్లడిస్తానని ప్రకటించారు. నాడు ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బీజేపీ అధిష్ఠానం అనుమతితో కేసీఆర్ బండారం బయటపెడతానని అన్నారు. తాను చెప్పబోయేది ముమ్మాటికీ పార్లమెంటును కుదిపేసే అంశం అవుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.