వైసీపీ కీలక నేతలను చంద్రబాబు బెదిరిస్తున్నారు.. ఎవరైనా ప్రతిస్పందిస్తే ప్రభుత్వానికి సంబంధం లేదు: సజ్జల

26-02-2021 Fri 13:26
  • చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు
  • హత్యా రాజకీయాలను నడుపుతున్నారు
  • జుగుప్సాకరమైన భాషను వాడుతున్నారు
If something happens to Chandrababu govt will not be responsible says Sajjala

వైసీపీ కీలక నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఓటమిపాలైన తర్వాత చంద్రబాబులో చాలా మార్పులు వచ్చాయని... వ్యక్తిగత దూషణలకు దిగుతూ జుగుప్సాకరమైన భాషను వాడుతున్నారని అన్నారు. హత్యా రాజకీయాలను నడుపుతున్నారని విమర్శించారు.

కుప్పం పర్యటన సందర్భంగా ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ కీలక నేతలను బెదిరిస్తున్నారని... ఆయన మాటలకు ఎవరైనా మనస్తాపానికి గురై... ప్రతిస్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదని అన్నారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.