హైద‌రాబాద్ రోడ్ల‌పై సైకిల్ తొక్కుతూ సాగిన హీరో అజిత్ ప్రయాణం!

26-02-2021 Fri 13:21
  • కోల్‌క‌తా వ‌ర‌కు సైక్లింగ్ చేయ‌నున్న అజిత్
  • ఇందులో భాగంగా హైద‌రాబాద్‌లో ద‌ర్శ‌నం
  • రోడ్డు ప‌క్క‌న ఆగి అప్పుడ‌ప్పుడు విశ్రాంతి
ajit pics goes viral

తమిళ స్టార్ హీరో అజిత్ హైద‌రాబాద్ రోడ్ల‌పై సైకిల్ తొక్కుతూ కనిపించాడు. త‌న‌ను ఎవ్వ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా బ్లాక్ అవుట్‌ఫిట్, హెల్మెట్, గాగుల్స్ ధరించాడు. అయితే, ఆయ‌న హైద‌రాబాద్ కు సినిమా షూటింగ్ కోసం లేదా మ‌రో ప‌ని మీదా రాలేదు. స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేయడమంటే అజిత్ ఇష్ట‌ప‌డ‌తాడు.
          
ఆయ‌న త‌మిళ‌నాడు నుంచి కోల్‌కతా వరకు సైక్లింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇందులో భాగంగా హైద‌రాబాద్ రోడ్ల‌పై నుంచి వెళ్లాడు.  హైద‌రాబాద్ లోని ప‌లు చోట్ల కాసేపు సైకిల్ ఆపి ఆయ‌న విశ్రాంతి తీసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం ఆయన‌ హెచ్ వినోద్ దర్శకత్వంలో వలిమై అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఆయ‌న సినిమాలు తెలుగులోనూ డ‌బ్ అవుతుంటాయి.