milk: సామాన్యుడికి మ‌రిన్ని క‌ష్టాలు.. పాల ధ‌ర‌లూ భారీగా పెంచాల‌ని నిర్ణ‌యం

  • ఇప్ప‌టికే పెట్రోలు, డీజిల్,  వంటగ్యాస్, ఉల్లి ధరల పెంపు
  • మధ్యప్రదేశ్ లోని రాట్లం సిటీలో పాల ధరల పెరుగుద‌ల‌
  • మార్చి 1 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశం
  • దేశ వ్యాప్తంగా ప్ర‌భావం
milk rates to be hiked

సామాన్యుడి మీద పాల ధ‌ర‌ల పెరుగుద‌ల రూపంలో మ‌రో పిడుగు ప‌డ‌నుంది. ఇప్ప‌టికే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, ఉల్లి ధరల‌తో పాటు ప‌లు వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యులు ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని రాట్లం సిటీలో పాల ధరలు పెరగనున్న నేపథ్యంలో దాని ప్ర‌భావంతో దేశం మొత్తం మీద కూడా పాల ధరలు భారీగా పెర‌గ‌నున్నాయి.

జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం..  రాట్లంలో పాల ధరలు పెంచాల‌ని అక్క‌డి ప‌లు సంఘాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ నెల 23న ఆయా సంఘాలు స‌మావేశం నిర్వహించి లీటరు పాలపై రూ.12 పెంచాల‌ని నిర్ణ‌యించాయి. ఈ మేర‌కు అధికారుల అనుమతితో వ‌చ్చేనెల 1 నుంచే ఈ ధరల‌ పెంపును అమలు చేయనున్నారు.

ఇప్ప‌టికే అధికంగా ఉన్న పాల ధర కొత్త ధ‌ర‌లు అమ‌ల్లోకి వ‌స్తే లీటరుకు రూ .55కు చేర‌నుంది. ప్రస్తుతం లీటర్ పాల ధర రూ.43గా ఉంది. నిజానికి గత ఏడాదిలోనే పాల ధరలు పెంచాల‌ని ఉత్పత్తిదారులు డిమాండ్ చేసిన‌ప్ప‌టికీ, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వారి నిర్ణ‌యం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాల ర‌వాణాకూ అధిక ఖ‌ర్చు అవుతోంది. దీంతో పాల‌ ధరలను కూడా పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు అక్క‌డి ఉత్పత్తిదారుల అసోసియేషన్ ప్ర‌క‌టించింది.

More Telugu News