మళ్లీ షూటింగుకి రెడీ అవుతున్న సూపర్ స్టార్!

26-02-2021 Fri 12:34
  • శివ దర్శకత్వంలో రజనీకాంత్ 'అన్నాత్తే'
  • డిసెంబర్లో షూటింగులో వుండగా అస్వస్థత
  • ఇన్నాళ్లూ విశ్రాంతి తీసుకున్న రజనీకాంత్
  • మార్చ్ 15 నుంచి తిరిగి షూటింగ్ మొదలు     
Rajanikanth to start shooting for Annatthe film

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ షూటింగు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం షూటింగ్ గత డిసెంబర్లో హైదరాబాదులో కొన్నాళ్లు జరిగింది. అయితే, షూటింగులో ఉండగా రజనీకాంత్ అస్వస్థతకు గురికావడంతో.. ఆయనను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించడం.. తిరిగి ఆయన చెన్నై వెళ్లిపోయి విశ్రాంతి తీసుకోవడం జరిగింది.

ఇక ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంతో ఉండడంతో చిత్రం షూటింగును తిరిగి ప్రారంభించుకోమని దర్శక నిర్మాతలకు చెప్పారట. ఈ నేపథ్యంలో షూటింగును వచ్చే నెల 15 నుంచి తిరిగి నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, షూటింగును తిరిగి హైదరాబాదులో నిర్వహిస్తారా? లేక చెన్నైలోనే జరుపుతారా? అన్నది ఇంకా వెల్లడికాలేదు. వచ్చే నవంబరు 4న విడుదల కానున్న ఈ చిత్రంలో  ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ నాయికలుగా నటిస్తున్నారు.