హీరో నితిన్ వీపుపైకి ఎగిరి దూకబోయి కిందపడిన ప్రియా ప్రకాశ్... ఫన్నీ వీడియో ఇదిగో!

26-02-2021 Fri 10:12
  • 'చెక్' సినిమాలో నటిస్తున్న ప్రియా ప్రకాశ్
  • సినిమా షూటింగ్ లో చిరు ప్రమాదం
  • తనకేమీ కాలేదన్న ప్రియ
Priya Prakash Shared Funny Video

ఒక్కసారి కన్నుకొట్టి కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వరియర్, ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న 'చెక్' సినిమాలో నటిస్తూ, టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసి, తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. ఈ సినిమా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కగా, షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను ఆమె అభిమానులతో షేర్ చేసుకుంది.

షూటింగ్ లో భాగంగా, నితిన్ నడుస్తూ రాగా, వెనుక నుంచి పరిగెత్తుకుని వచ్చే ప్రియా ప్రకాశ్, ఎగిరి, వీపుపైకి ఎక్కాల్సి వుంది. ఈ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో పట్టుతప్పిన ప్రియ, వెల్లకిలా నేలపై పడిపోయింది. పక్కనే ఉన్న సిబ్బంది వచ్చి ఆమె పైకి లేచేందుకు సాయం చేయగా, తనకేమీ కాలేదన్నట్టుగా 'థంబ్' చూపించింది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.