టూ వీలర్ పై నుంచి పడబోయిన మమతా బెనర్జీ... వీడియో ఇదిగో!

26-02-2021 Fri 08:13
  • త్వరలో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు
  • పెరుగుతున్న పెట్రో ధరలపై నిరసన
  • విద్యుత్ వాహనంపై ప్రయాణించిన మమత
  • అదుపుతప్పే సమయంలో పట్టుకున్న సెక్యూరిటీ
Mamata Banerjee Slipped from two Wheeler viral Video

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ద్విచక్ర వాహనంపై నుంచి పడబోయి, త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పడు వైరల్ అవుతోంది. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో, మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత, ఆమెను గద్దె దించి, తొలిసారిగా పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలి కాలంలో పెట్రోలు ధరలు నిత్యమూ పెరుగుతూ, సామాన్యులపై పెను భారం మోపుతున్న వేళ, ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రోత్సహించాలని నిర్ణయించిన మమత, ధరల పెంపునకు నిరసనగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ ఆధారిత టూ వీలర్ పై హెల్మెట్ ధరించి, ఆమె ప్రయాణిస్తుండగా, బండి అదుపుతప్పింది. దీంతో ఆమె కిందపడబోయారు. అప్పటికే ఆమె చుట్టూ పరిగెడుతున్న భద్రతా సిబ్బంది, మమతకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా, బండిని అదుపు చేశారు. ఆపై మమతా బెనర్జీ తన రైడింగ్ ను కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.