Mohan Bhagawat: ఇండియా నుంచి విడిపోయిన దేశాలు ఎప్పటికైనా కలుస్తాయి: మోహన్ భగవత్

  • విడిపోయిన దేశాల్లో ఇప్పటికీ అశాంతి
  • పాక్, ఆఫ్ఘన్ లు ఎప్పటికైనా కలవచ్చు
  • ధర్మబద్ధంగా జీవిస్తున్నది హిందూ సమాజమేనని వ్యాఖ్య
Mohan Bhagawat Comments on India pakistan Re Union

భారత ఉపఖండం ధర్మానికి ప్రతిబింబమని, గతంలో ఇండియా నుంచి విడిపోయిన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో ఇంతవరకూ శాంతి నెలకొనలేదని వ్యాఖ్యానించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్, భవిష్యత్తులో ఆ దేశాలు తిరిగి ఇండియాలో కలవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాడుగుల నాగఫణి శర్మ రచించిన 'విశ్వ భారతం' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవిస్తున్నది హిందూ సమాజం మాత్రమేనని ఆయన అన్నారు. ఎన్నోరకాల విపత్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడే దేశంగా ఇండియాను మిగతా దేశాలు గుర్తిస్తున్నాయని తెలిపారు.

More Telugu News