గృహిణి కొన్న లాటరీకి కోటి రూపాయలు!

25-02-2021 Thu 22:04
  • పంజాబ్ లో మహిళకు బంపర్ ప్రైజ్
  • రూ.100తో లాటరీ టికెట్ కొన్న రేణూ చౌహాన్
  • ఈ నెల 11న డ్రా తీసిన అధికారులు
  • రేణూ లాటరీ టికెట్ కు కోటి రూపాయలు
Punjab woman wins one crore in lottery

భారతదేశంలో లాటరీ వ్యవస్థ ఈనాటిది కాదు. పలు రాష్ట్రాల్లో లాటరీలను ప్రభుత్వాలే నిర్వహిస్తుంటాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వ లాటరీలో ఓ మహిళను ఊహించని విధంగా అదృష్టం వరించింది. అమృత్ సర్ నగరానికి చెందిన రేణూ చౌహాన్ కొన్నిరోజుల కిందట ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. ఆ టికెట్ నెంబరు డి-12228. ఈ నెల 11వ తేదీన డ్రా తీయగా రేణూ చౌహాన్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు కోటి రూపాయల బహుమతి వచ్చింది. దీనికి సంబంధించిన పత్రాలను రేణూ చౌహాన్ అధికారులకు సమర్పించగా, త్వరలోనే లాటరీ ప్రైజ్ మనీ ఆమె ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెప్పారు.

కాగా, రేణూ చౌహాన్ ఓ గృహిణి. ఆమె భర్త స్థానికంగా ఓ వస్త్రదుకాణం నిర్వహిస్తున్నారు. కేవలం రూ.100 చెల్లించి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు కోటి రూపాయల బంపర్ ప్రైజ్ రావడం పట్ల ఆమె ఆనందం అంతాఇంతా కాదు. ఈ డబ్బుతో తమ జీవితం మరింత సాఫీగా సాగిపోతుందని తెలిపింది.