చిత్తూరు జిల్లాలో మరో 21 కరోనా కేసుల నమోదు

25-02-2021 Thu 19:06
  • ఏపీలో గత 24 గంటల్లో 35,443 కరోనా పరీక్షలు
  • 82 మందికి పాజిటివ్
  • 74 మందికి కరోనా నయం
  • ఇంకా 611 మందికి చికిత్స
Twenty one corona positive cases identified in Chittoor district

ఏపీలో గడచిన 24 గంటల్లో 35,443 కరోనా పరీక్షలు నిర్వహించగా 82 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 8, కృష్ణా జిల్లాలో 7 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 74 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో తాజాగా ఒక్క మరణం కూడా సంభవించలేదు.

ఇప్పటివరకు 8,89,585 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,806 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకున్నారు. మరో 611 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,168గా నమోదైంది.