ఏపీలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

25-02-2021 Thu 17:11
  • త్వరలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
  • మార్చి 29తో ముగియనున్న నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం
  • చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఓ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ
  • సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో మరో స్థానం ఖాళీ
  • అభ్యర్థుల జాబితా వెల్లడించిన సజ్జల
YCP announced MLC candidates

ఏపీలో త్వరలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, కరీమున్నీసా, చల్లా భగీరథరెడ్డి, బల్లి కల్యాణచక్రవర్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులని సజ్జల తెలిపారు.

ఏపీలో పలు కారణాలతో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మార్చి 29తో నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండగా, చల్లా రామకృష్ణారెడ్డి మృతితో మరో ఎమ్మెల్సీ స్థానం, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లడంతో మరో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ ఏర్పడింది. కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టడంలేదని సజ్జల వెల్లడించారు.