'దృశ్యం 3' కూడా వస్తుందంటున్న దర్శకుడు!

25-02-2021 Thu 17:01
  • మోహన్ లాల్, మీనా జంటగా 'దృశ్యం 2'
  • తెలుగులో వెంకటేశ్, మీనాలతో రీమేక్
  • 'దృశ్యం 3' కథ చెప్పిన దర్శకుడు
  • మోహన్ లాల్ ఆసక్తి చూపారంటున్న జీతూ  
Another sequel on cards for Drushyam in Malayalam
మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో గతంలో మలయాళంలో వచ్చిన 'దృశ్యం' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. చిన్న చిత్రంగా రూపొంది భారీ కలెక్షన్లను రాబట్టింది. దాంతో తెలుగులో వెంకటేశ్ తో నిర్మించగా ఇక్కడా పెద్ద హిట్టయింది. అలాగే హిందీలో రీమేక్ చేయగా, అక్కడ కూడా హిట్టయింది.

ఇక ఇటీవలే 'దృశ్యం 2' కూడా రూపొందింది. మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్ కూడా హిట్టవ్వడంతో ఇప్పుడు దీనిని తెలుగులో మళ్లీ వెంకటేశ్, మీనాలతోనే ఇక్కడా రీమేక్ చేస్తున్నారు. ఇదిలావుంచితే, 'దృశ్యం 3' నిర్మాణం కూడా ఉందని దర్శకుడు జీతూ జోసెఫ్ తాజాగా వెల్లడించాడు.  

దీనికి సంబంధించిన కథను చూచాయగా మోహన్ లాల్ కు, నిర్మాతకు చెప్పానని, క్లైమాక్స్ విని వారిద్దరూ ఎంతో ఆసక్తి చూపుతున్నారని దర్శకుడు జోసెఫ్ చెప్పారు. అయితే, స్క్రిప్టును ఇంకా పక్కాగా తయారుచేయడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. 'దృశ్యం 3'తో కూడా ప్రేక్షకులను కచ్చితంగా థ్రిల్ చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం జీతూ జోసెఫ్ తెలుగు 'దృశ్యం 2'కి దర్శకత్వం వహిస్తూ బిజీగా వున్నారు.