మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే

25-02-2021 Thu 15:45
  • 258 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 115 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4.55 శాతం పుంజుకున్న ఎన్టీపీసీ షేర్
Stock markets ends in profits

దేశీయ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లోనే కొనసాగాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్ షేర్ల కొనుగోళ్లకు మదుపుదారులు మొగ్గుచూపడంతో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 258 పాయింట్లు లాభపడి 51,039కి పెరిగింది. నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 15,097కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (4.55%), ఓఎన్జీసీ (4.35%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.94%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.64%), యాక్సిస్ బ్యాంక్ (2.68%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-2.09%), నెస్లే ఇండియా (-1.38%), ఎల్ అండ్ టీ (-1.10%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.10%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.69%).