సుకుమార్ ఇంట వేడుక‌కు హాజ‌రైన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు.. ఫొటోలు ఇవిగో

25-02-2021 Thu 12:12
  • సుకుమార్ కూతురు సుకృతి వేణి ఓణీల వేడుక
  • త‌ర‌లి వ‌చ్చిన‌ టాలీవుడ్ ప్ర‌ముఖులు
  • మహేశ్‌బాబు-నమ్రత, నాగచైతన్య-సమంత హాజ‌రు
sukumar daughter function in hyderabad

సినీ దర్శకుడు సుకుమార్ ముద్దుల కూతురు సుకృతి వేణి ఓణీల వేడుక గ‌త రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులు త‌ర‌లివ‌చ్చి ఆమెను ఆశీర్వ‌దించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.
      
మహేశ్‌బాబు-నమ్రత, నాగచైతన్య-సమంత దంపతులతోపాటు జూనియ‌ర్ ఎన్టీఆర్‌-ప్రణతి కూడా ఈ వేడుక‌కు వ‌చ్చారు. హీరోలు రామ్‌, సాయి ‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌తో పాటు హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్‌, కీర్తి సురేశ్, కృతిశెట్టితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు దీనికి హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్ దుబాయికి వెళ్ల‌డంతో ఈ వేడుక‌కు రాలేక‌పోయాడు.