భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి దుబాయ్‌లో అల్లు అర్జున్‌.. ఫొటోలు వైర‌ల్

25-02-2021 Thu 11:17
  • థీమ్‌ పార్క్‌ను చూసిన బ‌న్నీ ఫ్యామిలీ
  • చిల్డ్రన్చి ప్లే మ్యూజియంలో ఆడుకున్న బ‌న్నీ పిల్ల‌లు
  • షూటింగుకి బ్రేక్ రావడంతో అల్లు అర్జున్ హాలిడే ట్రిప్  
bunny enjoys in dubai

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి దుబాయ్ వెళ్లాడు. అక్క‌డ ఆయ‌న కుటుంబం దిగిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. అల్లు అర్జున్, ఆయ‌న‌ భార్య స్నేహా రెడ్డి, కూతురు అర్హ బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకోగా, కుమారుడు అయాన్ మాత్రం వైట్ క‌ల‌ర్ టీష‌ర్ట్ తో క‌న‌ప‌డుతున్నాడు.
         
దుబాయ్‌లోని  థీమ్‌ పార్క్‌ను వారంతా చూసి, గేమ్స్ ఆడారు.  చిల్డ్రన్స్‌ ప్లే మ్యూజియం ఎయిర్‌ గ్యాలరీలో పిల్ల‌ల‌ను ఆడించాడు. వాటికి సంబంధించిన ప‌లు ఫొటోల‌ను స్నేహా రెడ్డి పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. వ‌రుస‌గా షూటింగుల్లో పాల్గొన్న బ‌న్నీ కాస్త స‌మ‌యం దొర‌క‌డంతో  ఇలా దుబాయ్‌లో భార్యాపిల్ల‌ల‌తో ఎంజాయ్ చేస్తూ క‌న‌ప‌డ్డాడు.
   
సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ న‌టిస్తోన్న‌  'పుష్ప' సినిమాను ఆగస్టు 13న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు ఆ సినిమా యూనిట్ ఇప్ప‌టికే తెలిపింది.  ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌గా క‌న‌ప‌డ‌నున్నాడు.