Junior NTR: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అప్ డేట్!

Update on NTR and Trivikram movie
షార్ట్స్‌లో చూడండి
గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగుతో బిజీగా వున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ముగింపు దశకు చేరింది. త్వరలో ఇది పూర్తికానుండడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెడుతున్నాడు.

ఈ క్రమంలో ముందుగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రాన్ని చేయనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. షూటింగును మే నెలాఖరులో ప్రారంభించి ఏకధాటిగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో నటించే కథానాయిక విషయమై రకరకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని అంటున్నారు. మరోపక్క, ఇందులో ప్రధాన విలన్ పాత్రను ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి పోషించే అవకాశం వుంది.
Go Back to Shorts
Junior NTR
Trivikram Srinivas
Vijay Setupati
RRR

More Telugu News