ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ ను బహిష్కరించాలని ఏపీ బీజేపీ నిర్ణయం!

25-02-2021 Thu 10:42
  • ఇటీవల ఏబీఎన్ చానెల్ లో చర్చ
  • బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి
  • చానెల్ ను బహిష్కరిస్తున్నట్టు లేఖ
AP BJP Boycot News Channel

ఇటీవల తెలుగు వార్తా చానెల్ 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి'లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి పాల్గొన్న వేళ, ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన ఏపీ బీజేపీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చర్చ సందర్భంగా ఒకరు తమ నేతపై దాడి చేస్తే, అతనిపై ఫిర్యాదు చేయకుండా, మరోమారు అతనిని చర్చకు ఆహ్వానించారని ఆరోపించిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాసరావు, సదరు చానెల్ ను బహిష్కరిస్తున్నట్టు మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు.

ఆ చానెల్ తో పాటు, దానితో సంబంధమున్న పత్రికనూ బహిష్కరిస్తున్నామని, ఇకపై బీజేపీ నాయకులు నిర్వహించే మీడియా కార్యక్రమాలకు వాటిని ఆహ్వానించరాదని, సదరు చానెల్ చర్చలకు బీజేపీ నేతలు ఎవరూ వెళ్లవద్దని ఆయన కోరారు.