ప్రియాంకా చోప్రా 'గుమ్మడి కాయ' డ్రస్... ఫిగర్ గురించి ఎందుకని ప్రశ్న!

25-02-2021 Thu 09:34
  • వెరైటీ డ్రస్ తో ప్రియాంక ఫొటో షూట్
  • వైరల్ అయిన చిత్రాలు
  • ఫిగర్ ముఖ్యం కాదని నెటిజన్ కు సమాధానం
Actress Priyanka Sharp Answer to Netigen

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, ఇటీవల ఓ గుమ్మడి కాయ ఆకారంలో కనిపించేలా ఉన్న డ్రస్ వేసుకుని ఫొటో షూట్ చేయించుకుని, ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచగా, అవి వైరల్ అయ్యాయి. వీటిని చూసిన ఓ నెటిజన్, ఇదేం రకం దుస్తులని ప్రశ్నించగా, ప్రియాంక అదిరిపోయే సమాధానాన్ని ఇచ్చింది.

"మేడమ్... ఇది నిజంగా డ్రస్సేనా? ఇటువంటివి వేసుకుంటే... మంచి ఫిగర్ ఉన్నా లేనట్లే కదా?" అంటూ ఓ వ్యక్తి ప్రశ్నించగా, ప్రియాంక స్పందించింది. "ఫిగర్, అందచందాలు అనేవి ముఖ్యం కాదని చెప్పడమే తన పాయింట్" అంటూ ఆమె ఇచ్చిన సమాధానాన్ని చూసి మిగతా నెటిజన్లు 'దటీజ్ ప్రియాంక' అంటూ కితాబునిస్తున్నారు.