Tamil Nadu: ఉన్నతాధికారి తనను లైంగికంగా వేధించారన్న మహిళా ఐపీఎస్ అధికారి.. తమిళనాడులో దుమారం

  • విచారణ కోసం ఆరుగురు సభ్యుల బృందం
  • మోదీ పర్యటన ఏర్పాట్ల నుంచి అధికారిని దూరం పెట్టిన వైనం
  • ప్రభుత్వంపై విరుచుకుపడిన స్టాలిన్
Woman IPS Alleges that higher official sexually harassed her

పోలీసు ఉన్నతాధికారి ఒకరు తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ మహిళా ఐపీఎస్ అధికారి ఒకరు చేసిన ఆరోపణలు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. ఆమె ఫిర్యాదుతో విచారణ కోసం రాష్ట్ర హోంశాఖ ఆరుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆమె ఆరోపణలపై సదరు ఉన్నతాధికారి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

అయితే, మోదీ పర్యటనకు మాత్రం ఆయనను దూరం పెట్టినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తుండగా, ఆ బాధ్యతల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని దూరం పెట్టినట్టు అధికారులు తెలిపారు.

మరోవైపు, ఈ ఘటనపై ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల అహంకారానికి ఇది నిదర్శనమని, ఇలాంటి పోలీసు అధికారులు ఉన్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసిన మహిళా అధికారిని మెచ్చుకుంటున్నట్టు స్టాలిన్ పేర్కొన్నారు.

More Telugu News