సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

25-02-2021 Thu 07:25
  • పారితోషికాన్ని పెంచేసిన 'ఉప్పెన' భామ 
  • జూబ్లీ హిల్స్ లో మరో ఇల్లు కొన్న బాలకృష్ణ
  • హిందీలో 'నాంది' రీమేక్ ప్రయత్నాలు
Kruti Shetty hikes her remuneration

*  ఒక సినిమా హిట్టయితే చాలు.. ఇక అందులో నటించిన హీరో హీరోయిన్లకు డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పుడు 'ఉప్పెన' సినిమా ద్వారా పరిచయమైన కథానాయిక కృతి శెట్టికి కూడా అలాగే డిమాండ్ పెరిగింది. ఆమెకు పలు సినిమాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో తన పారితోషికాన్ని ఈ చిన్నది సుమారు 50 లక్షలకు పెంచినట్టు ప్రచారం జరుగుతోంది.
*  హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా హైదరాబాదు జూబ్లీహిల్స్ లో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మూడు అంతస్తుల ఈ భవనాన్ని సుమారు 15 కోట్లు వెచ్చించి ఆయన తీసుకున్నట్టు సమాచారం. ఇటీవలే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందట.
*  అల్లరి నరేశ్ హీరోగా తాజాగా వచ్చిన 'నాంది' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో బాక్సాఫీసు వద్ద ఇది మంచి విజయాన్ని సాధిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు హిందీలో రీమేక్ చేసే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే ఈ చిత్రం ఇతర భాషల రీమేక్ హక్కులను ఆయన సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు.