రైలు ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో పట్టాలపైకి మరో 11 జతల రైళ్లు

25-02-2021 Thu 07:21
  • సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్టం నుంచి రాకపోకలు సాగించే రైళ్లు
  • 8 డైలీ సర్వీసులు, మిగతావి వీక్లీలు
  • ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి
Another 22 Trains Will Be Availble From April 1st

రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లలో మరికొన్ని పట్టాలెక్కబోతున్నాయి. మరో 22 రైళ్లను (11 జతలు) పునరుద్ధరించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే నిన్న తెలిపింది. ఇందులో సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, ఔరంగాబాద్, రేణిగుంట నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఉన్నాయి.

అయితే, వీటిలో ఎక్కువ శాతం ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. మిగిలినవి తొలి వారంలో అందుబాటులోకి వస్తాయి. కొత్తగా అందుబాటులోకి రానున్న రైళ్లలో 8 డైలీ సర్వీసులు కాగా, వారానికి మూడు రోజులు నడిచేవి రెండు ఉన్నాయి. మిగిలిన 12 రైళ్లు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తాయి.

విజయవాడ-సికింద్రాబాద్ (02799), సికింద్రాబాద్-విజయవాడ (02800), గుంటూరు-కాచిగూడ (07251), కాచిగూడ-గుంటూరు(07252), సికింద్రాబాద్-విశాఖపట్టణం (02739), విశాఖపట్టణం-సికింద్రాబాద్ (02740), ఆదిలాబాద్-నాందేడ్ (07409), నాందేడ్-ఆదిలాబాద్ (07410) రైళ్లు ప్రతి రోజూ నడవనుండగా, మిగతా రైళ్లలో వారానికి ఒకసారి, మూడుసార్లు నడిచేవి ఉన్నాయి.