ఆచార్య షూటింగ్ లో మెగాస్టార్, మెగా పవర్ స్టార్... వైరల్ వీడియో!

25-02-2021 Thu 06:34
  • ప్రస్తుతం మారేడుమిల్లిలో షూటింగ్
  • చిరుతో జత కలిసిన రామ్ చరణ్
  • మే 13న విడుదల కానున్న చిత్రం

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు కూడా. ఈ సినిమాను మే 13న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రం షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుండగా, అక్కడి లొకేషన్లో చిరంజీవి, రామ్ చరణ్ ఉన్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చిరంజీవి మరింత యంగ్ గా స్టయిలిష్ లుక్ లో కనిపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు.