సింహం అని చెప్పుకుంటున్నారు... ఆయన గ్రామ సింహం మాత్రమే: మంత్రి వెల్లంపల్లిపై జలీల్ ఖాన్

24-02-2021 Wed 16:50
  • వెల్లంపల్లికి రాజకీయ భిక్ష పెట్టింది నేనే
  • ఆయన ఒంటినిండా అవినీతి మచ్చలే
  • ఆలయంలో అవినీతి జరుగుతుంటే సీఎం జగన్ కళ్లు మూసుకున్నారా?
Jaleel Khan fires on Vellampalli

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం పక్కనే మంత్రి ఇల్లు ఉంటుందని, అయినా గుడిలో దోపిడీ జరిగిందంటే ఆయన ఎందుకని ఎద్దేవా చేశారు. వెల్లంపల్లికి రాజకీయ భిక్ష పెట్టింది తానేనని అన్నారు. వెల్లంపల్లి తాను సింహం అని చెప్పుకుంటుంటారని, కానీ ఆయన గ్రామ సింహం మాత్రమేనని విమర్శించారు.

వెల్లంపల్లి పెద్ద అవినీతిపరుడని, ఆయన ఒంటినిండా అవినీతి మచ్చలేనని జలీల్ ఖాన్ అన్నారు. మంత్రి పదవికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జలీల్ ఖాన్ అంటే ఒక బ్రాండ్ అని... వెల్లంపల్లి మాదిరి తాను లుచ్చాను కాదని పరుష పదజాలంతో విమర్శించారు. అమ్మవారి ఆలయంలో అవినీతి జరుగుతుంటే సీఎం జగన్ కళ్లు మూసుకున్నారా? అని ప్రశ్నించారు.