ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన రష్మిక!

24-02-2021 Wed 16:20
  • 'మిషన్ మజ్ను' సినిమా చేస్తున్న రష్మిక 
  • చర్చల దశలో వున్న మరో సినిమా
  • హోటల్ లో ఉండలేక ఇల్లు కొన్న రష్మిక
Rashmika buys a new house in Mumbai

టాలీవుడ్ హాట్ స్టార్ రష్మిక అప్పుడే ముంబైలో ఓ ఇల్లు కొనేసిందట. అవును, ఇది నిజమే! తెలుగు సినిమాలతో బిజీగా వున్న ఈ ముద్దుగమ్మ ఇటీవల బాలీవుడ్ ప్రవేశం కూడా చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న 'మిషన్ మజ్ను' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ముంబైలో మొదలైంది కూడా. అలాగే మరో హిందీ సినిమా కూడా చర్చల దశలో వుందట. దీనిని బట్టి చూస్తే అమ్మడు బాలీవుడ్ మీద బాగా దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో హిందీ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం అక్కడ హోటల్ లో ఉంటోంది. అయితే, హోటల్ వాతావరణం నచ్చక, ఎలాగూ అక్కడే వుండాలని అనుకుంటోంది కాబట్టి.. తాజాగా ముంబైలోని ఓ ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన ఫ్లాట్ ను ఈ చిన్నది కొనుగోలు చేసిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈమధ్య  హైదరాబాదు, ముంబై మధ్య రష్మిక ఎక్కువగా తిరగాల్సివస్తోందనీ, ముంబైలో హోమ్లీ ఫీలింగ్ కోసం ఫ్లాట్ తీసుకుందని రష్మిక సన్నిహిత వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. అలాగే, హైదరాబాదు ఇంటిలోని కొన్ని వస్తువులను కూడా ముంబై ఇంటికి తరలించింది. మొత్తానికి రష్మిక బాలీవుడ్ లో కెరీర్ని లాగించడానికి పెద్ద ప్లాన్ లోనే ఉందన్నమాట!