అమ్మా, మీరెక్కడో రాజకుమార్తెగా మళ్లీ జన్మించే ఉంటారు: జయలలిత జయంతి సందర్భంగా విజయశాంతి

24-02-2021 Wed 15:31
  • నేడు జయలలిత జయంతి
  • జయలలితను స్మరించుకున్న విజయశాంతి
  • మీ స్నేహం, అభిమానం, ఆప్యాయత తీపి గుర్తులుగా అలాగే ఉంటాయని వ్యాఖ్య
Vijayashanthi recalls memories with Jayalalitha

ఈరోజు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జయంతి. ఈ సందర్భంగా ఆమెను సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి స్మరించుకున్నారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ, 'అమ్మా... మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారు. అయినప్పటికీ మాకందరికీ తెలిసిన రోజుగా మీకివే పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పంచిన స్నేహం, అభిమానం, ఆప్యాయత నాకు జీవితకాలపు కానుకలుగా... తీపి గుర్తులుగా ఎప్పటికీ అలాగే ఉంటాయి.

మత తీవ్రవాదుల హిట్ లిస్టులో నేను ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు నా భద్రత కోసం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పురట్చి తలైవియిన్ అన్బు తంగై (విప్లవ నాయకి జయలలితకు ప్రియమైన చెల్లెలు).... ప్రచార బీరంగి (ప్రచారంలో ఫిరంగి) అంటూ మీరు నాకిచ్చిన గౌరవప్రదమైన పిలుపులు ఈ జన్మంతా జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి' అని ట్వీట్ చేశారు. జయలలితతో కలిసి ఉన్న ఫొటోను ఆమె షేర్ చేశారు.