'నరేంద్ర మోదీ స్టేడియం'లో మూడో టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్!

24-02-2021 Wed 14:20
  • మొతేరా వేదికగా డేనైట్ టెస్ట్ మ్యాచ్
  • ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగిన ఇండియా
  • 100వ టెస్ట్ ఆడుతున్న ఇశాంత్ శర్మ
England won the toss and elected to bat in third test against India

ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు గుజరాత్ లోని మొతేరా వేదికగా ప్రారంభమైంది. డేనైట్ టెస్ట్ అయిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ స్టేడియం ఇటీవలే నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ స్టేడియం కెపాసిటీ లక్షా 10 వేలు. ఈ స్టేడియంకు 'నరేంద్ర మోదీ స్టేడియం' అని పేరు పెట్టారు. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా పేసర్ ఇషాంత్ శర్మ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతోంది.

జట్ల వివరాలు:
ఇండియా: రోహిత్ శర్మ, శుభ్ మన్‌ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, బుమ్రా.
 
ఇంగ్లండ్ జట్టు: డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.