అతను మా అధికార ప్రతినిధి కాదు.. విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి పట్ల టీడీపీ స్పందన

24-02-2021 Wed 13:45
  • న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్‌లో దాడి
  • బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డిని కొట్టిన ‌ కొలికపూడి శ్రీనివాస్
  • శ్రీనివాస్ త‌మ త‌ర‌ఫున టీవీ డిబేట్ లో పాల్గొన‌లేద‌న్న టీడీపీ
tdp gives clarity on viral video

ఓ తెలుగు న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్‌లో బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డిని అమ‌రావ‌తి జేఏసీ నేత‌ కొలికపూడి శ్రీనివాస్ చెప్పుతో కొట్టడం క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో తెగ వైర‌ల్ అవుతుండ‌డం, త‌మ‌పై ప‌లు ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌డంతో దీనిపై టీడీపీ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా స్పందించింది. అత‌డు త‌మ ప్ర‌తినిధేనని సామాజిక మాధ్య‌మాల్లో జ‌రుగుతోన్న ప్ర‌చారాన్ని ఖండించింది. శ్రీనివాస్ త‌మ పార్టీ అధికారిక మీడియా ప్ర‌తినిధి కాద‌ని, అలాగే, త‌మ త‌ర‌ఫున ఆ డిబేట్ లో పాల్గొన‌లేద‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చింది.